After a brilliant performance in the 1st T20 where India secured its maiden win against the New Zealand (in T20Is), the men in blue will be facing the Kiwis in the second T20 in Rajkot on Saturday.
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఢిల్లీలో జరిగిన తొలి టీ20లో 53 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లీసేన టీ20 సిరిస్‌పై కన్నేసింది. రాజ్‌కోట్ వేదికగా శనివారం జరిగే రెండో టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి టీ20లో విఫలమైన కివీస్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సరే గెలవాలనే కసితో ఉంది. రాజ్ కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం రాత్రి 7 గంటలకు ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది. కివీస్‌తో తొలి టీ20లో విజయం సాధించి పదేళ్ల నిరీక్షణకు భారత్ తెరదించిన సంగతి తెలిసిందే. శనివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.